xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలుతుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలు
ఆంధ్రప్రదేశ్

తుపాను నేపథ్యంలో జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు అప్రమత్తంగా ఉండాలి

26-10-2026 14:29
తుపాను నేపథ్యంలో జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు అప్రమత్తంగా ఉండాలి
ఆర్నబ్ తుపాను నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు.
xPress24, Paravathipuram, October 26, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 26: ఆర్నబ్ తుపాను నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. అక్టోబర్ 27 నుంచి 29 వరకు తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెట్లు, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లోకి విద్యార్థులు, సిబ్బందిని అనుమతించరాదని స్పష్టం చేశారు. ప్రతి మండలానికి ఒక అధ్యాపకుడిని నోడల్ అధికారిగా నియమించి, కళాశాలలకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) కార్యాలయంలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కళాశాలల హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల సంఖ్యను సంబంధిత అధికారులు తెలియజేయాలని, సెలవు రోజుల్లో విద్యార్థులను బయటకు పంపకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను హెచ్చరికలు, పాటించాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని ఆదేశించారు. కళాశాలలకు వెళ్లే మార్గాల్లో వాగులు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో విద్యార్థులను ముందుగానే అప్రమత్తం చేయాలని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు కళాశాలల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకుంటూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, కళాశాలల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.