ఆంధ్రప్రదేశ్
తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి: మంత్రి గొట్టిపాటి
16-11-2026 14:49

తుపాను ప్రభావంతో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. తుపాను పరిస్థితులపై విద్యుత్ శాఖ అధికారులతో అమరావతిలో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుపాను కారణంగా విద్యుత్ స్తంభాలు కూలిపోయినా, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నా త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ అంతరాయాలు ఏర్పడిన ప్రాంతాల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అందుబాటులో ఉంచి, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.
xPress24, Amaravati, November 16,