ఆంధ్రప్రదేశ్
తుపాను నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక
29-10-2026 10:01

ఆంధ్రప్రదేశ్ లో అర్నబ్ తుపాను నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి బుధవారం ప్రాథమిక నివేదిక అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో బాధితులకు బుధవారం నుంచి ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు, పరిహారంపై దృశ్య మాధ్యమం విధానంలో నిర్వహించే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మధ్యాహ్నం తాను స్వయంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో నష్ట తీవ్రతను పరిశీలించనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉందని చెప్పారు.
xPress24, Amaravati, October 29,