ఆంధ్రప్రదేశ్
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు, రేపు పర్యటించనున్న కేంద్ర బృందం
31-10-2026 12:12

ఓర్నాబ్ తుపాను నష్టాలని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో ఎడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఈ రోజు నుంచి రెండు రోజులపాటు ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అమరావతిలోని ఆర్టీజిఎస్ కేంద్రంలో తుపాను సమయంలో తీసుకున్న చర్యలు, జరిగన నష్టాలను అధికారులు బృందానికి వివరిస్తారని తెలిపారు. అనంతరం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండు బృందాలుగా ఏర్పడి పర్యటించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర బృందం సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ బృందాలు కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తాయని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
xPress24, Amaravathi, October 31,