ఆంధ్రప్రదేశ్
తుపాను బాధితులందరినీ ఆదుకుంటాం : సీఎం చంద్రబాబు
29-10-2026 09:47

ఓర్నబ్ తుపాను కారణంగా నష్టపోయిన వారిని ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ -ఆర్టీజీఎస్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడుతూ, తుపాను ప్రభావంపై గత ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం సమీక్షలు నిర్వహించామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తుపాను తీవ్రతను అంచనా వేసి, క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.ప్రజల భద్రత, రక్షణ, పునరావాసానికి ప్రాధాన్యమిస్తూ పరిస్థితులకు అనుగుణంగా అధికారులను అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రి తెలియజేశారు.
xPress24, Amaravati, October 29,