జాతీయం
తుపాను సన్నద్ధత
27-10-2026 09:29

అర్నబ్ తుపాను సన్నద్ధతపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించినట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. సహాయక చర్యల కోసం విపత్తు నిర్వహణ బృందాలతో పాటు సైన్యం, నౌకాదళం, వాయుసేన, కోస్ట్‌గార్డ్ దళాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
xPress24, New Delhi, October 27,