ఆంధ్రప్రదేశ్
తుపాను సహాయక చర్యలపై ఉపముఖ్యమంత్రి
04-11-2026 11:19

ఆంధ్రప్రదేశ్ లో మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రక్షణ, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తుపాను సహాయక చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఉన్నతాధికారులతో అమరావతి నుంచి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాలు తగ్గిన ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని, గ్రామాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు.ఆస్తి నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు అందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
xPress24, Amaravati, November 4,