ఆంధ్రప్రదేశ్
తుపాను సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష
06-11-2026 14:35

ఆంధ్రప్రదేశ్ లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, రహదారులు, తాగునీటి సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుపాను నష్టాలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి అమరావతిలో ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్యుత్, రహదారులు, తాగునీరు తదితర రంగాల్లో జరిగిన నష్టాన్ని అధికారులు వివరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తుపాను బాధితులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించి కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శుక్రవారం పర్యటించి క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించనున్నారు.
xPress24, Amaravati, November 6,