xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదికప్రభావిత గ్రామాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం : పవన్‌ కళ్యాణ్‌తుపాను ప్రభావంపై రైల్వే మంత్రి సమీక్షఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులుప్రగతి ప్రాజెక్టులపై సీఎస్‌లతో ప్రధానమంత్రి సమీక్షఅవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలితుపాను నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదికప్రభావిత గ్రామాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం : పవన్‌ కళ్యాణ్‌తుపాను ప్రభావంపై రైల్వే మంత్రి సమీక్షఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులుప్రగతి ప్రాజెక్టులపై సీఎస్‌లతో ప్రధానమంత్రి సమీక్షఅవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఆంధ్రప్రదేశ్

తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్

29-10-2026 09:32
తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ సూచించారు.
xPress24, ELuru, October 28, ఏలూరు జిల్లా, అక్టోబర్ 28: తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ సూచించారు. తుఫాను ప్రభావంతో బలమైన గాలులు వీస్తున్న ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది తక్షణమే స్పందిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. గాలుల తీవ్రతకు రహదారులపై పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించడంతో పాటు, ఇళ్లపై చెట్లు కూలిన ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. పోలీసు సిబ్బందికి తోడుగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా సహాయక చర్యల్లో భాగస్వాములను చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఏదైనా ప్రమాదం ఎదురైనా, ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నా పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. అత్యవసర సహాయం కోసం 112 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. తుఫాను తీవ్రత తగ్గిందని భావించి అనవసరంగా బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రహదారులపైకి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం వరకు గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.