xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలి

30-10-2026 09:49
తుఫాన్ ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు.
xPress24, Narasapuram, October 29, పశ్చిమగోదావరి జిల్లా: తుఫాన్ ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం నరసాపురంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌తో కలిసి మంత్రి సంబంధిత అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితి, పునరుద్ధరణ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ, ఆక్వాకల్చర్ రంగాలతో పాటు గృహాలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో ఇప్పటికే 2,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, అదనంగా తెలంగాణ నుంచి 500 మంది సిబ్బందిని రప్పించినట్లు వెల్లడించారు. సిబ్బంది నిరంతరం పనిచేస్తూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రహదారులపై కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇందుకోసం అవసరమైన చైన్‌సా యంత్రాలను కొనుగోలు చేసి అందించినట్లు వెల్లడించారు. ప్రజలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. అత్యవసర సేవలకు సంబంధించిన విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.