xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'
ఆంధ్రప్రదేశ్

తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి

19-11-2026 09:48
తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి
తుఫాన్‌ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి ఆదేశించారు.
xPress24, Paravathipuram, November 18, తుఫాన్‌ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి ఆదేశించారు. తుఫాన్‌ కారణంగా ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం పార్వతీపురం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు సచిన్ అర్చిత్ రహార్, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో కె. హేమలత పాల్గొన్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుఫాన్‌ విపత్తు నిర్వహణ సన్నద్ధతపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, తాగునీరు, వైద్య సేవలు తదితర అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. మరో వారంలో ప్రసవించే అవకాశం ఉన్న గర్భిణులను ముందుగానే గుర్తించి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులకు తరలించాలని తెలిపారు. డయాలసిస్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. అరటి, కొబ్బరి, జీడిపంటలు సాగు చేసిన రైతులు పంట కోత దశలో ఉంటే వీలైనంత త్వరగా కోతలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈదురుగాలుల కారణంగా పంటలు నేలకొరిగి నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తుఫాన్‌ సమయంలో విద్యుత్, తాగునీరు, వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన యంత్రాలు, పరికరాలను అందుబాటులో ఉంచాలని, జిల్లా విపత్తు నిర్వహణ అధికారికి హైడ్రాలిక్ మిషన్‌ను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.