ఆంధ్రప్రదేశ్
తుఫాను ప్రభావంపై అప్రమత్తమైన గుంటూరు జిల్లా యంత్రాంగం
26-10-2026 14:24

రానున్న మూడు రోజుల్లో అర్నబ్ తుఫాను ప్రభావం చూపనున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదివారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
xPress24, Guntur, October 26,
గుంటూరు, అక్టోబర్ 26:
రానున్న మూడు రోజుల్లో అర్నబ్ తుఫాను ప్రభావం చూపనున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదివారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున భారీ వృక్షాలు, హోర్డింగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.
విద్యుత్, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేలా పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని తెలిపారు. ఆయా కేంద్రాల్లో ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.