xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలుతుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలు
ఆంధ్రప్రదేశ్

తుఫాను హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

26-10-2026 14:29
తుఫాను హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎన్‌టీఆర్ జిల్లాలో అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం నుంచి అర్నాబ్ తుఫాను ప్రభావంతో భారీ ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నందిగామ ఆర్డీవో అనిల్ కుమార్ సూచించారు.
xPress24, Nandigama, October 26, నందిగామ, అక్టోబర్ 26: ఎన్‌టీఆర్ జిల్లాలో అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం నుంచి అర్నాబ్ తుఫాను ప్రభావంతో భారీ ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నందిగామ ఆర్డీవో అనిల్ కుమార్ సూచించారు. సోమవారం నందిగామలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, పాత భవనాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పనులు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని తెలిపారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేసి, అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. విద్యుత్, రోడ్లు-భవనాలు (ఆర్‌అండ్‌బీ), పంచాయతీరాజ్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు ఇతర శాఖలు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాయని తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం నుంచి తదుపరి రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో అనిల్ కుమార్ కోరారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.