xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సింగపూర్ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ విజయవాడకు రాకసకల శుభాల ఉ‘సిరి’జాతీయ విద్యా దినోత్సవంఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా క్రీడాకారిణి పీవీ సింధుసీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లుసింగపూర్ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ విజయవాడకు రాకసకల శుభాల ఉ‘సిరి’జాతీయ విద్యా దినోత్సవంఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా క్రీడాకారిణి పీవీ సింధుసీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్

తుఫానులతో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం

10-11-2026 15:25
తుఫానులతో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ఆర్నాబ్, మురసు తుఫానుల కారణంగా వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.
xPress24, Amaravati, November 10, అమరావతి, 10 నవంబర్  2026 : రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ఆర్నాబ్, మురసు తుఫానుల కారణంగా వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫానుల వల్ల జరిగిన పంట నష్టం, రైతులకు కలిగిన ఆర్థిక నష్టాల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 10,90,933 హెక్టార్ల సాగు విస్తీర్ణానికి గాను 3,27,843 హెక్టార్లలో (30.05 శాతం) పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగా 5,23,136 మంది రైతులు ప్రభావితమయ్యారని, 9,78,091 టన్నుల పంట దిగుబడి నష్టం వాటిల్లిందని వివరించారు. మొత్తం రూ.2,392.84 కోట్ల ఆర్థిక నష్టం సంభవించినట్లు అంచనా వేసినట్లు వెల్లడించారు. కోనసీమ జిల్లాలో అత్యధికంగా 99.19 శాతం సాగు విస్తీర్ణం దెబ్బతిన్నట్లు తెలిపారు. ఈ జిల్లాలో 94,808 మంది రైతులు ప్రభావితమయ్యారని, రూ.348.88 కోట్ల ఆర్థిక నష్టం నమోదైందని పేర్కొన్నారు. ఆర్నాబ్ తుఫాను నష్టాలకు సంబంధించి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ.815.57 కోట్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ.714.96 కోట్ల పరిహారాన్ని అంచనా వేసినట్లు అధికారులు వివరించారు. మురసు తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 5,62,445 హెక్టార్ల సాగు విస్తీర్ణానికి గాను 1,33,351 హెక్టార్లలో (23.71 శాతం) పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. 1,86,269 మంది రైతులు ప్రభావితమయ్యారని, 3,38,302 టన్నుల పంట దిగుబడి నష్టం వాటిల్లిందని వివరించారు. మొత్తం రూ.816.53 కోట్ల ఆర్థిక నష్టం సంభవించినట్లు అంచనా వేశారు. ఈ నష్టాలకు సంబంధించి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ.321.64 కోట్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ.266.67 కోట్లను అంచనా వేసినట్లు వెల్లడించారు. ఇక ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో 15 జిల్లాల్లోని 215 మండలాలు, 1,310 గ్రామాల్లో 23,211.48 హెక్టార్ల ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ నష్టం కారణంగా 58,990 మంది ఉద్యాన రైతులు ప్రభావితమైనట్లు వివరించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.