xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ
తెలంగాణ

తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!

24-10-2026 12:55
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు త్వరలోనే సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బోధి పెవిలియన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
xPress24, Hyderabad, October 24, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బోధి పెవిలియన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇతర మంత్రులతో కలిసి సాగునీటి ప్రాజెక్టులపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించేందుకు తక్షణమే సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. ఈ ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని, ఈ నెల 23 తర్వాత చర్చలకు పిలుస్తానని మహారాష్ట్ర సీఎం సూచనప్రాయంగా తెలిపారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. (..పాజ్..) మరోవైపు డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలం, నార్లాపూర్ ప్రాజెక్టుల నుంచి ఏదుల వరకు 0.6 టీఎంసీల నీటిని అదనంగా తెచ్చుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ నిర్ణయంతో పాలమూరు ప్రాంత నీటి అవసరాలకు ఎలాంటి ఢోకా ఉండదని సీఎం ధీమా వ్యక్తం చేశారు. పంప్ హౌజులు, పంపుల అమరిక పనులను విలంబం లేకుండా వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.