xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్

29-10-2026 14:16
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్
తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని శ్రీవారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
xPress24, Tirupati, October 29, తిరుపతి, అక్టోబర్ 29: తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని శ్రీవారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. అక్టోబర్ 30వ తేదీ రాత్రి 11.51 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా నావిక్ శ్రేణిలోని మూడో ఉపగ్రహమైన నావిక్-03ను జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రొపల్షన్ వ్యవస్థ సాయంతో ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి చేర్చనున్నట్లు పేర్కొన్నారు. దేశీయ అవసరాలకు అనుగుణంగా పొజిషనింగ్, నావిగేషన్ సేవలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. ఇది నావిగేషన్ సేవల కోసం ప్రయోగిస్తున్న నాలుగో ఉపగ్రహమని వివరించారు. ప్రైవేట్ సంస్థ చేపట్టిన ప్రయోగంతో కలిపి, ఈ ఏడాది జనవరి నుంచి ఇస్రో చేపడుతున్న ఐదో రాకెట్ ప్రయోగం ఇదేనని తెలిపారు. మానవ రహిత గగన్‌యాన్ తొలి మిషన్‌కు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. బైట్: వి. నారాయణన్, ఇస్రో చైర్మన్

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.