xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'
తెలంగాణ

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో క్లైమేట్ చేంజ్ కాంక్లేవ్

19-11-2026 09:51
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో క్లైమేట్ చేంజ్ కాంక్లేవ్
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా నిర్వహించే క్లైమేట్ చేంజ్ కాంక్లేవ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సదస్సుకు దేశంలోని పర్యావరణ వేత్తలను కూడా ఆహ్వానించాలన్నారు.
xPress24, Hyderabad, November 18, డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా నిర్వహించే క్లైమేట్ చేంజ్ కాంక్లేవ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనగా, అటవీ దళాధిపతి వినయ్ కుమార్, సీసీఎఫ్‌లు డా.ప్రియాంక వర్గీస్, ఎస్‌జే ఆశ, ఎఫ్‌సీఆర్ఐ డీన్ ప్రవీణ్, రంగారెడ్డి డీఎఫ్‌ఓ ఆశిష్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంక్లేవ్‌కు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఈ నెల 27న నగరంలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఘనంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, జలవనరుల సంరక్షణ తదితర కీలక అంశాలపై జరిగే ఈ సదస్సుకు దేశంలోని ప్రముఖ పర్యావరణవేత్తలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలన్నారు. ఈ కార్యక్రమానికి ‘వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్ర సింగ్ హాజరవుతున్నారని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ను కూడా ఆహ్వానిస్తున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కాంక్లేవ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి చర్చలకు వేదిక కావాలని, ముందస్తు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. బైట్- ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.