తెలంగాణ
తెలంగాణ నీటి హక్కులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
19-11-2026 09:51

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఏపీ ప్రభుత్వం చేస్తున్న నీటిదోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నాగార్జున సాగర్ ఏపీ నీటిగి దొంగలించడానికి ప్రయత్నిస్తూ.. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగిస్తోందని విమర్శించారు.
xPress24, Hyderabad, November 18,
తెలంగాణ నీటి హక్కులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఏపీ ప్రభుత్వం చేస్తున్న నీటిదోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. నాగార్జున సాగర్ ఏపీ నీటిగి దొంగలించడానికి ప్రయత్నిస్తూ.. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగిస్తోందని విమర్శించారు. అధికారిక అనుమతులు లేకుండానే, తాగునీటి ప్రాజెక్టు ముసుగులో 'డెడ్ స్టోరేజీ' స్థాయి నుండి 9 టీఎంసీల నీటిని తరలించే కుట్ర జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదన్నారు.
విజయపురి సౌత్ వద్ద 510 అడుగుల లోతు నుండి నీటిని తరలించేలా నాగార్జున సాగర్ వద్ద సొరంగం నిర్మాణం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియట్లేదా? అని ప్రశ్నించారు. తాగునీటి పథకం పేరుతో 1,650 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ నిర్మించి 9 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. పైకి ఇది తాగునీటి ప్రాజెక్టులా కనిపిస్తున్నా..వాస్తవానికి సాగునీటిని కూడా తరలించే కుట్ర జరుగుతోందన్నారు.
ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌ను నీటిపారుదల సలహాదారుగా నియమించడంపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఉమ్మడి ఏపీలో ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేశారని, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు కూడా రాశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించిన వ్యక్తిని రాష్ట్రానికి నీటిపారుదల సలహాదారుగా ఎందుకు నియమించారో, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బైట్- కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్