xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డిఅయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పెద్ద పండుగ విజయదశమి

21-10-2026 09:30
తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన దసరా పండుగకు రాష్ట్రం ముస్తాబయింది. ఊరూ వాడా, పల్లె పట్నం విజయదశమి శోభ సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పెద్ద పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో అమ్మవారి దర్శనాలు, ఇంటింటా పూజలతో కళకళలాడుతున్నాయి.
xPress24, hyderabad, October 20, తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన, అతిపెద్ద పండుగ దసరా! తొమ్మిది రోజులు  దేవీ నవరాత్రి పూజలతో పాటు సంస్కృతీ సంప్రదాయాల బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకొని, పదో రోజున 'విజయదశమి'గా దసరాను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఈ విజయదశమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.  ఈ విధంగా నవరాత్రుల పూజలు తెలంగాణ సంస్కృతికి  అద్దం పడుతున్నాయి. తెలంగాణ దసరాలో అత్యంత కీలకమైన ఘట్టం శమీ పూజ అనగా జమ్మి పూజ. విజయదశమి రోజు సాయంత్రం గ్రామస్తులంతా ఊరి పొలిమేరల్లో ఉండే జమ్మి చెట్టు వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.  పూజ అనంతరం జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి వారి కాళ్లకు నమస్కరించి దీవెనలు అందుకుంటారు. స్నేహితులు, బంధువులు జమ్మి ఆకులు ఇచ్చుకుంటూ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. దసరా రోజున పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణలో ఒక పవిత్రమైన ఆచారంగా వస్తోంది. విజయదశమి నాడు పాలపిట్ట కనిపిస్తే శుభం జరుగుతుందని, చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుందని ప్రజల బలమైన విశ్వాసం. ఈ పర్వదినాన విజయదశమి నాడే ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహిస్తారు. రైతులు తమ వ్యవసాయ పనిముట్లను, వృత్తిపనివారు తమ పరికరాలను, వ్యాపారస్తులు,  ఒక్కరూ తమ వాహనాలను, ఆయుధాలను శుభ్రం చేసి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కొత్త వ్యాపారాలు లేదా పనులు ప్రారంభించడానికి ఈ రోజును అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని రామ్ లీలా మైదానం, లాల్ ఖిల్లా ప్రాంతం, కోల్ కతాలో దుర్గాదేవికి పూజలు, రావణ దహనాలు,టపాసులు కాల్చుతూ ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. దసరా పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి . వరంగల్ భద్రకాళి ఆలయం సహా ప్రముఖ దేవాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకుంటున్నారు. ఇంటిల్లిపాది నూతన వస్త్రాలు, పిండివంటలు, విందులతో ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకుంటున్నారు.

🎥 వీడియో

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పెద్ద పండుగ విజయదశమి

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.