తెలంగాణ
తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలు
23-10-2026 09:59

తెలంగాణలో 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పత్తి సాగు, మార్కెట్ ధరలు, కొనుగోళ్లకు చేసిన ఏర్పాట్లు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలపై మంత్రి నిన్న సమీక్షించారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడటం వంటి చర్యలు ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో పాటు దేశవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నందున, రాష్ట్రంలో కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు.
xPress24, Hyderabad, October 23,