ఆంధ్రప్రదేశ్
తొలేళ్ల పండగకు పోటెత్తిన భక్తులు.. పైడితల్లి అమ్మవారి దర్శనానికి బారులు
26-10-2026 14:29

తొలేళ్ల పండగ సందర్భంగా విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
xPress24, Vizianagaram, October 26,
విజయనగరం: తొలేళ్ల పండగ సందర్భంగా విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూ లైన్లు కిటకిటలాడాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా దర్శన ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను కల్పించింది. పలువురు ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తొలేళ్ల పండగ నేపథ్యంలో విజయనగరం పట్టణానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పట్టణంలో పండగ సందడి నెలకొంది.