ఆంధ్రప్రదేశ్
తీవ్ర తుపాను
27-10-2026 09:31

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ఈరోజు అతి తీవ్ర తుపానుగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్ లోని ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు ఈరోజు, రేపు అధికారులు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
xPress24, Amaravati, October 27,