తెలంగాణ
త్వరలో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ
29-10-2026 09:48

తెలంగాణలో త్వరలో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని రసత్ర సచివాలయంలో యువనేస్తం శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు పీఎస్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘పీఎస్‌ఆర్ యువనేస్తం’ పేరుతో ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో శిక్షణ పొందలేని నిరుద్యోగులకు ఉచితంగా ఆన్‌లైన్ శిక్షణతో పాటు పుస్తకాలు అందించనున్నట్లు చెప్పారు.ఇప్పటికే లక్ష మంది యువత ఈ శిక్షణ కోసం పేర్లు నమోదు చేసుకున్నారని వారికి ఏడాది పాటు శిక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
xPress24, Hyderabad, October 29,