జాతీయం
దిల్లీలో తీవ్రస్థాయికి వాయు కాలుష్యం.. ప్రమాదకరంగా ‘ఏక్యూఐ’
13-11-2026 12:00

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. శుక్రవారం ఉదయం 7:31 గంటల సమయానికి నగరం మొత్తం గాలి నాణ్యత సూచిక 494గా నమోదైంది.
xPress24, Delhi, November 13,
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. శుక్రవారం ఉదయం 7:31 గంటల సమయానికి నగరం మొత్తం గాలి నాణ్యత సూచిక 494గా నమోదైంది. దట్టమైన పొగమంచు, కాలుష్యం కారణంగా నగరాన్ని దట్టమైన పొగ కమ్మేయడంతో పలు ప్రాంతాల్లో విజిబిలిటీ గణనీయంగా పడిపోయింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సివియర్ కేటగిరీలో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణాంకాల ప్రకారం.. అత్యధిక కాలుష్యం నమోదైన ప్రాంతాల్లో ఐఐటీ దిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ ఏక్యూఐ 488గా నమోదైంది. అలాగే ఐటీఓలో 455, ఆనంద్ విహార్‌లో 419, రోహిణిలో 413, రాజోక్రి సరిహద్దు ప్రాంతంలో 402 చొప్పున ఏక్యూఐ నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ కాలుష్య తీవ్రత అధికంగానే ఉంది. ఆర్కే పురంలో 391, మందిర్ మార్గ్‌లో 378, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలో 369, ఉత్తమ్ నగర్‌లో 363, లోధి రోడ్‌లో 341గా ఏక్యూఐ నమోదైంది. అయితే, ధౌలా కువాన్ పరిసర ప్రాంతంలో మాత్రం ఏక్యూఐ 161గా నమోదై ‘మోస్తరు’ కేటగిరీలో ఉండటం గమనార్హం. దిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోంది. నగరవ్యాప్తంగా వాటర్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయడంతో పాటు, గాలిలోని సూక్ష్మ ధూళి కణాల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది.