జాతీయం
దిల్లీలోని లోక్ నివాస్‌లో శబద్ కీర్తన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
24-11-2026 11:22
గురునానక్ దేవ్ ప్రకాష్ పురబ్ సందర్భంగా ఢిల్లీలోని లోక్ నివాస్‌లో నిర్వహించిన శబద్ కీర్తన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గురుబాణీలోని ప్రతి పదం, కీర్తనలోని ప్రతి రాగం ఒక ఆధ్యాత్మిక సాధన అని ప్రధాని పేర్కొన్నారు. లోక్ నివాస్‌లో ఇటువంటి కార్యక్రమానికి ప్రధాని హాజరుకావడం ఇదే తొలిసారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జిత్ సింగ్ సంధు తెలిపారు.
xPress24, Delhi, November 23,
గురునానక్ దేవ్ ప్రకాష్ పురబ్ సందర్భంగా దిల్లీలోని లోక్ నివాస్‌లో నిర్వహించిన శబద్ కీర్తన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రధాని మోదీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. గురునానక్ దేవ్‌కు నమస్కరిస్తూ దేశ ప్రజలందరికీ ప్రకాష్ పురబ్ శుభాకాంక్షలు తెలిపారు. గురుపురబ్ సందర్భంగా శబద్ కీర్తనలో పాల్గొనే అవకాశం కల్పించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జిత్ సింగ్ సంధుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. గురుబాణీలోని ప్రతి పదం, కీర్తనలోని ప్రతి రాగం కేవలం సంగీతం కాదని, అదొక ఆధ్యాత్మిక సాధన అని మోదీ పేర్కొన్నారు.
అన్ని మతాల మధ్య ఐక్యతకు నిదర్శనం.. ప్రధాని రాక గర్వకారణమన్న లెఫ్టినెంట్ గవర్నర్
గురు సాహిబ్ బోధనలు కేవలం ఆధ్యాత్మిక సూత్రాలు మాత్రమే కాదని, తరతరాల సంస్కర్తలకు మార్గదర్శకాలుగా నిలిచాయని లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జిత్ సింగ్ సంధు తెలిపారు. ఈ కార్యక్రమం అన్ని మతాల ప్రజల మధ్య ఐక్యతకు, పరస్పర ప్రేమకు ప్రతీక అని లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని లోక్ నివాస్‌లో ఇటువంటి కార్యక్రమానికి ఒక ప్రధానమంత్రి హాజరుకావడం ఇదే తొలిసారని, ప్రధాని మోదీ రాక ఢిల్లీ ప్రజలకు, సిక్కు సమాజానికి గర్వకారణమని సంధు అన్నారు.
Bytes:
నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి
తరణ్‌జిత్ సింగ్ సంధు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్