తెలంగాణ
దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
22-10-2026 11:44

దసరా సెలవులు ముగియడంతో నగర వాసులు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరిస్తున్నారు.
xPress24, Hyderabad, October 22,
దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దసరా సెలవులు ముగియడంతో వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది ప్రజలు తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. దీంతో ఎల్బీ నగర్- దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో భారీగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. మరోవైపు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్‌బండ్ పరిసరాలకు భారీగా విగ్రహాలు తరలిరావడంతో అక్కడా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశామని పోలీసులు చెబుతున్నారు.