xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలుశ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం..మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లుగుంటూరులో మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టు ప్రారంభంస్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలుదళితుల హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్తా: ఎంపీ వంశీకృష్ణపుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలుశ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం..మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లుగుంటూరులో మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టు ప్రారంభంస్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలుదళితుల హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్తా: ఎంపీ వంశీకృష్ణ
తెలంగాణ

దళితుల హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్తా: ఎంపీ వంశీకృష్ణ

23-11-2026 15:43
దళితుల హక్కుల సాధన కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. పెద్దపల్లి పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
xPress24, Hyderabad, November 23, దళితుల హక్కుల సాధన కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. పెద్దపల్లి పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో కొందరు చేస్తున్న విభజన రాజకీయాలపై పోరాటానికి తాను ముందుంటానని, అందరినీ కలుపుకొని వెళ్లాలని దివంగత కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి తనకు సూచించారని గుర్తుచేశారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన న్యాయమైన వాటాపై పార్లమెంట్‌లో గళమెత్తుతానని తెలిపారు. తనపై కొందరు కావాలని చేస్తున్న విమర్శలను పట్టించుకోనని, పేదల అభ్యున్నతే తన లక్ష్యమని అన్నారు. మరోవైపు, శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి రైల్వే స్టేషన్లలో సూపర్‌ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ఎంపీ కోరారు. కేరళ, హిమసాగర్, అహల్యానగరి, కోర్బా ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. బైట్ గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.