xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డిఅయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

దేశంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ సీట్లు పెరగాలి: ఎన్.రామచందర్ రావు

21-10-2026 11:54
జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాల పెంపునకు డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు విపక్షాలు మద్దతు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపునిచ్చారు. 50 శాతం సీట్లు పెంచినా ఏ ప్రాంతానికి నష్టం జరగదన్నారు. ఎన్నికల ప్రక్రియను కించపరుస్తూ కాంగ్రెస్ అర్బన్ నక్సల్స్‌తో కలిసి దేశంలో అలజడి సృష్టిస్తోందని ఆయన విమర్శించారు.
xPress24, hyderabad, October 20, దేశంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ స్థానాల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు విపక్ష పార్టీలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు కలిసిరావాలని, డీలిమిటేషన్ ప్రక్రియలో 50 శాతం సీట్లు పెంచడం వల్ల ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'ఓట్ చోరీ' ప్రచారాన్ని రామచందర్ రావు తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో నిష్పాక్షిక ఎన్నికల ద్వారా మాత్రమే అధికార మార్పిడి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రజా తీర్పుతో ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టకుండా, కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్‌తో చేతులు కలిపి దేశంలో అలజడులు సృష్టించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. అరాచకాలు, హింసను ప్రేరేపించడం ద్వారా ప్రభుత్వాలను మార్చలేరని ఆయన హెచ్చరించారు. బైట్స్ ఎన్. రామచందర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

🎥 వీడియో

దేశంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ సీట్లు పెరగాలి: ఎన్.రామచందర్ రావు

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.