xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నంసూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నం
తెలంగాణ

దేశంలోనే అతిపెద్ద బహుళ-రంగ ప్రదర్శనగా 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'.. ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

24-11-2026 11:22
దేశంలోనే అతిపెద్ద బహుళ-రంగ ప్రదర్శనగా 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'.. ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026' ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో సమీక్ష నిర్వహించారు. 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద బహుళ-రంగ ప్రదర్శనగా దీనిని చేపడుతున్నామని, వెయ్యికి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సమ్మిట్‌లో రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, క్లైమేట్ కాంక్లేవ్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు, డిసెంబర్ 10 నుంచి 13 వరకు సాధారణ ప్రజలకు ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
xPress24, Hyderabad, November 23, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కోసం ఏర్పాట్లు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సులలో 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద బహుళ-రంగ ఎక్స్‌పోగా దీనిని చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో మంత్రి డి. శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో సమ్మిట్ ఏర్పాట్లపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ సమ్మిట్ జరగనుంది. అన్ని రంగాల నుంచి వెయ్యికి పైగా కంపెనీలు, దాదాపు 1,500 మంది సీఈవోలు, పెట్టుబడిదారులు, రాయబారులు, మరో 1,500 మంది పరిశ్రమల ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రతినిధుల ప్రవేశానికి ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగించాలని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించాలని సీఎం సూచించారు. తెలంగాణ సంస్కృతి, కాకతీయుల శిల్పకళ, సమ్మక్క సారలమ్మ తోరణాల నమూనాలు, నిర్మల్ పెయింటింగ్స్, చేనేత, గాంధీ సరోవర్ ప్రాజెక్టులను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 7న రక్షా ఎక్స్‌పోలో ఎయిర్ షో.. అంతర్జాతీయ విద్యావేత్తలతో సీఎం ప్రత్యేక చర్చలు సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో, క్లైమేట్ కాంక్లేవ్, ట్రైబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 7న ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించే ఎయిర్ షో వీక్షణకు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. క్లైమేట్ కాంక్లేవ్‌లో సద్గురు జగ్గి వాసుదేవ్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు పాల్గొంటారు. ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూకే, యూరోపియన్ పెవిలియన్లతో పాటు ఐఎస్‌బీ, ఐఐటీ హైదరాబాద్, నల్సార్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న 'స్కూల్స్ ఆఫ్ ది ఫ్యూచర్', డిసెంబర్ 8న 'రిఫార్మ్స్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్' అంశాలపై అంతర్జాతీయ విద్యావేత్తలతో చర్చిస్తారు. ఇండియా జాయ్ కాంక్లేవ్‌లో అడోబ్, సోనీ, ఉబిసాఫ్ట్ సహా 150 గేమింగ్, యానిమేషన్ కంపెనీలు పాల్గొంటాయి. సాధారణ పౌరుల కోసం డిసెంబర్ 10 నుంచి 13 వరకు సమ్మిట్‌ను సందర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, నవీన్ మిత్తల్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి పాల్గొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.