ఆంధ్రప్రదేశ్
ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి సమీక్ష
26-11-2026 12:06

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు నిరంతర చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధరల నియంత్రణపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో పంటల దిగుబడులపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రానున్న ఏడాదిన్నర పాటు మార్కెట్ ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలలో పర్యటిస్తారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఓ భక్తుడు శ్రీవేంకటేశ్వర స్వామివారికి 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించనున్నారు. ఈ ఆభరణాలను టీటీడీ అధికారికంగా స్వీకరించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
xPress24, Amaravati, November 26,