తెలంగాణ
నాగర్‌కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన
26-11-2026 12:03

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో గురువారం పర్యటించనున్నారు.ఈ సందర్భంగా జిల్లాలో 450 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. పర్యటనలో భాగంగా పదర మండలం మద్దిమడుగుకు చేరుకుంటారు. అక్కడ సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహం, పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అచ్చంపేటలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభా వేదిక వద్ద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అలాగే రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఇందిరమ్మ ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు.
xPress24, Hyderabad, November 26,