xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డిఅయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు: మంత్రి సీతక్క

21-10-2026 16:15
రాష్ట్రంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లాలోని రామప్ప చెరువును పరిశీలించిన ఆమె, వర్షాభావ పరిస్థితులను రాజకీయం చేయడం తగదన్నారు. నీటి సంరక్షణ పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
xPress24, Mulugu, October 21, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగి, వర్షాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలోని రామప్ప చెరువు, అక్కడి డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టును మంత్రి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామప్ప చెరువులో ప్రస్తుతం 29 అడుగుల మేర నీరు అందుబాటులో ఉందని వివరించారు. రాజకీయ ప్రయోజనాలకు విమర్శలు తగవు అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి పరిణామాలను ఏ శక్తీ పూర్తిగా నియంత్రించలేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు. నీటి సంరక్షణలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి పనులతో నీటి సంరక్షణ గ్రామాల్లో వీబీజీ రామ్ జీ పథకం కింద విస్తృతంగా నీటి సంరక్షణ పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. కూలీల సంఖ్యను పెంచి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచులు, గ్రామస్తులకు పిలుపునిచ్చారు. బైట్ - సీతక్క, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి

🎥 వీడియో

నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు: మంత్రి సీతక్క

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.