xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐకాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐ
తెలంగాణ

నాటు కోళ్ల పెంపకంతో ఆదర్శంగా నిలుస్తున్న ఉన్నత విద్యావంతుడు

17-11-2026 10:29
పెద్దపల్లి జిల్లా రాయదండికి చెందిన ఎం.కాం పట్టభద్రుడు పల్లె రాజు పటేల్ నాటు కోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్నాడు. 20 రాష్ట్రాలకు కోళ్లను విక్రయించడంతో పాటు 3,200 మంది రైతులకు శిక్షణ ఇచ్చి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
xPress24, Rayadandi, November 16, ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు పెద్దపల్లి జిల్లా యువకుడు. అంతర్గాం మండలం రాయదండి గ్రామానికి చెందిన పల్లె రాజు పటేల్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.కాం పూర్తి చేశాడు. నగరంలో కల్తీ ఆహారాన్ని గమనించిన ఆయన, ఎలాంటి హార్మోన్లు, ఇంజక్షన్లు వాడకుండా స్వచ్ఛమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో 8 సంవత్సరాల క్రితం నాటు కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు. అగ్రి గ్రీన్ ఫార్మ్స్ పేరిట నాటు కోళ్ల గుడ్లను సేకరించి ఇంక్యుబేటర్, హ్యాచరీలలో 3 రోజుల పాటు ఉంచి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నాడు. 20 రాష్ట్రాలకు విస్తరించిన వ్యాపారం, రైతులకు శిక్షణ ఉత్పత్తి అయిన కోడి పిల్లలను ఇతర ఫామ్‌లకు విక్రయిస్తూ వ్యాపారాన్ని విస్తరించాడు. ప్రస్తుతం దేశంలోని 20 రాష్ట్రాలకు తాను పెంచిన నాటు కోళ్లను విక్రయిస్తూ, మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇప్పటివరకు 3,200 మంది రైతులకు నాటు కోళ్ల పెంపకంపై శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తోడ్పడ్డాడు. ఆసక్తి ఉన్న రైతులకు తమ ఫామ్ వేదికగా శిక్షణ అందిస్తానని రాజు తెలిపాడు. ఈ రంగంలో చేసిన కృషికి గాను ఇప్పటివరకు 3 జాతీయ స్థాయి బహుమతులు, పలు రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్నాడు. బైట్ - పల్లె రాజు పటేల్, నాటు కోళ్ల పెంపకందారు, రాయదండి, పెద్దపల్లి జిల్లా

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.