తెలంగాణ
నేటి నుంచి 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు
19-11-2026 09:52

హైదరాబాద్‌లో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సు ఈరోజు ప్రారంభంకానుంది. ఈ సదస్సు నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. పాల్గొననున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి పాల్గొననున్నారు.
xPress24, Hyderabad, November 19,
హైదరాబాద్ హైటెక్స్ వేదికగా నేడు 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం కానుంది. ఈనెల 22న వరకు సదస్సు సాగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరై.. సదస్సును ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా 3,500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.ఈ సదస్సు గురించి రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.
పర్యావరణ హిత రోడ్ల నిర్మాణం, వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాలు, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలపై సమావేశంలో కీలక చర్చలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించిన పలు జాతీయ రహదారులకు త్వరలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2026-27 బడ్జెట్‌లో రోడ్లు, వంతెనలకు 5,677 కోట్ల రూపాయలు కేటాయించామని, రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్- విజయవాడ హైవే విస్తరణ, ఫ్యూచర్ సిటీ-మచిలీపట్నం పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ హైవేలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. సదస్సు అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి రాష్ట్ర ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. కాగా, 2014 తర్వాత ఈ సదస్సుకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. తొలిసారి 2016లో ఈ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సు జరిగింది.