xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'
తెలంగాణ

నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలు

19-11-2026 11:05
నేటి నుంచి  మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలు
మాజీ ప్రధాని ఇందిరమ్మ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు మరో 7 జిల్లాల్లో అంగన్వాడీ చిన్నారులకు తొలిముద్ద పథకం అమలు కానుంది.
xPress24, Hyderabad, November 19, రాష్ట్రవ్యాప్తంగా నేడు మరో 7 జిల్లాల్లో అంగన్వాడీ అల్పాహార పథకం తొలిముద్ద అమలు కానుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా  నవంబర్ 19న ఈ పథకాన్ని అదనంగా ఏడు జిల్లాల్లో అధికారులు ప్రారంభించనున్నారు. జనగాం, భూపాలపల్లి,  రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి,  వనపర్తి,  హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లోని 43,657 మంది చిన్నారులకు  బ్రేక్‌ఫాస్ట్ అందనుంది. ఇప్పటికే 7 జిల్లాల్లో 8,694 అంగన్వాడీ కేంద్రాల్లో 91,796 మంది చిన్నారులకు అల్పాహారం అందుతుండగా.. తాజాగా మరో ఏడు జిల్లాలలు ఈ పథకాన్ని విస్తరిస్తున్నారు. దీంతోలబ్ది పొందే చిన్నారుల సంఖ్య మరింత పెరగనుంది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలో మిగిలిన 19 జిల్లాల్లోనూ తొలిముద్ద పథకాన్ని అమలు చేసేందుకు అధికారుల చర్యలు తీసుకుంటున్నారు. కాగా, అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతోపాటు ప్రీ స్కూల్ విద్యలో అభ్యాస సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ తొలిముద్ద పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో 3 నుంచి 6 ఏళ్ల వయసు గల చిన్నారులు సుమారు 4.5 లక్షల మంది అంగన్వాడీ కేంద్రాలకు హాజరవుతున్నారు. అయితే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన  అనేకమంది చిన్నారులు  ఉదయం అల్పాహారం తీసుకోకుండానే కేంద్రాలకు వస్తున్నట్లు గుర్తించారు. దీంతో పిల్లల శక్తి సామర్థ్యాలు, ఏకాగ్రత తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం.. తొలి ముద్ద పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో ఒక్కో చిన్నారికి రోజుకు 116.25 కిలో కేలరీల శక్తితోపాటు 3.9 గ్రాముల ప్రోటీన్ అందుతోంది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.