xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
ఆంధ్రప్రదేశ్

నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ

29-10-2026 14:13
అర్నబ్ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
xPress24, Vijayawada, October 29, విజయవాడ: అర్నబ్ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ నార్త్ తహసీల్దార్ కార్యాలయ పరిధిలోని గుణదల ప్రాంతంలో సుమారు 70 ఎకరాల పంట పొలాలు వర్షపు నీటిలో మునిగినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా బండి శివయ్యకు చెందిన పంట పొలాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని మోటార్ల సహాయంతో వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పంట నష్టంపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి, బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పంట పొలాలు నీట మునిగి నష్టపోయిన రైతులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలిచి సహాయక చర్యలు చేపడుతున్న కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులకు గుణదల ప్రాంత రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.