తెలంగాణ
నేడు 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్
12-11-2026 10:04

వివిధ కారణాలతో వాయిదా పడిన 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఒకేసారి నోటిఫికేషన్లు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. మొత్తం 4 నగరపాలక సంస్థలు, 19 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు కలిపి మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల్లో రెండోదశ ఎన్నికలకు పురపాలక శాఖ ఏర్పాట్లు చేసింది. వీటికి తొలిదశ పంచాయతీలతో పాటు పోలింగ్ నిర్వహణకు కలెక్టర్లు, ఎస్పీలు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేయనుందని వెల్లడించారు.
xPress24, Vijayawada, November 12,