xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేకృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
తెలంగాణ

నేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్

19-11-2026 11:05
నేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి నేడు సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ప్రారంభించనున్నారు.
xPress24, Hyderabad, November 19, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సిద్దిపేట వేదికగా ప్రారంభించనున్నారు. నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్నిఅధికారికంగా ప్రారంభిస్తారు. అలాగే  రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రారంభించి.. రూ.544.11 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.  అలాగే సిద్దిపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌, దుబ్బాకలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. కాగా, అర్హులైన పేద కుటుంబానికి 5 లక్షల జీవితబీమా కల్పించడమే ఈ కొత్త పథకం ప్రధాన ఉద్దేశం. ఇంటింటికి ఇందిరమ్మ బీమా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేసింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి వయస్సు 18నుంచి 59ఏళ్లలోపు ఉండాలని పేర్కొంది. ఆధార్‌లోని పుట్టిన తేదీ ఆధారంగా వయస్సును నిర్దారిస్తారు. జనాభా గణనలో గుర్తించిన కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా అమలుచేయనున్నారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా సిద్దిపేట ఇందిరా చౌరస్తా నుంచి సభ జరిగే నాగదేవత కూడలి వరకు 2.2 కిలోమీటర్ల మేర సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్ర చేయనున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.