తెలంగాణ
నేడే ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీ
26-11-2026 14:26

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
xPress24, Hyderabad, November 26,
ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఇందిరమ్మ ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నేడు ప్రారంభం కానుంది. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం రేవంత్.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని కోటిమంది ఆడబిడ్డలకు చీరలతోపాటు కొత్త పింఛన్లు పంపిణీ చేయనున్నారు. దివ్యాంగులు, వితంతువులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు అందనున్నాయి. ఈ పర్యటనలో జిల్లాలో రూ.450 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు.
కాగా, ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు పదర మండలం మద్దిమడుగుకు సీఎం రేవంత్ హెలికాప్టర్‌లో చేరుకుంటారు. సంత్ సేవాలాల్ మహరాజ్ భారీ విగ్రహం, పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాభివృద్ధి, ఇతర పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అచ్చంపేటలో నిర్వహించే బహిరంగ సభా వేదిక వద్దకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. పాదయాత్రగా సభా ప్రాంగణానికి వెళ్తారు. అక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌తోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.