xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సాగునీటి ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబుఅల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. జైకా సాంకేతిక సహకారానికి కలెక్టర్ ప్రతిపాదననంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలుమౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంజనగణన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతివిశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుసాగునీటి ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబుఅల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. జైకా సాంకేతిక సహకారానికి కలెక్టర్ ప్రతిపాదననంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలుమౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంజనగణన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతివిశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
తెలంగాణ

నేడు స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాల ప్రదానం.. స్వచ్ఛ నగరాలకు అవార్డులు అందజేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

11-11-2026 12:42
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 అవార్డులను ఇవాళ న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. 10వ ఎడిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 4 వేలకు పైగా నగరాల్లో పారిశుధ్య ప్రమాణాలు, ఘన వ్యర్థాల నిర్వహణ, పౌరుల స్పందనను 43 సూచీల ద్వారా మదింపు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్, తోఖన్ సాహు పాల్గొని ఉత్తమ ర్యాంకులు సాధించిన పట్టణ సంస్థలకు పురస్కారాలు అందించనున్నారు.
xPress24, Delhi, November 11, దేశంలో అత్యుత్తమ పారిశుధ్య ప్రమాణాలు పాటించిన నగరాలకు కేంద్ర ప్రభుత్వం అందించే 'స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26' అవార్డులను ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ అమలులో విశేష కృషి చేసిన నగరాలు, రాష్ట్రాలను ఈ వేదికపై సత్కరించనున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, సహాయ మంత్రి తోఖన్ సాహు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 'స్వచ్ఛత కి నయీ పెహల్- బఢాయే హాథ్, కరే సఫాయీ సాథ్' అనే నినాదంతో 10వ ఎడిషన్ సర్వేక్షణ్‌ను కేంద్రం పూర్తి చేసింది. 2016లో కేవలం 73 పట్టణ స్థానిక సంస్థలతో ప్రారంభమైన ఈ సర్వేక్షణ్, తాజా ఎడిషన్‌ నాటికి 4 వేలకు పైగా నగరాలకు విస్తరించింది. 43 సూచీల ఆధారంగా 4 వేల నగరాల మూల్యాంకనం ఈ ఏడాది సర్వేక్షణ్‌లో పౌరుల ఫీడ్‌బ్యాక్‌కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. నగరాల్లోని రివర్ ఫ్రంట్ల పరిశుభ్రత, బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత నిబంధనల అమలు, పాఠశాలల్లో విద్యార్థుల ప్రవర్తన మార్పు కార్యక్రమాలను ప్రత్యేక కొలమానాలుగా చేర్చారు. వ్యర్థాల విభజన, సేకరణ, రవాణా, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి 10 విభాగాల్లోని 43 సూచీల ఆధారంగా నగరాల పనితీరును అంచనా వేసి ఈ అవార్డులను ఖరారు చేశారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.