xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ
తెలంగాణ

నేడు హైదరాబాదులో తెలంగాణ బిజెపి కీలక సమావేశం

24-10-2026 14:43
నేడు హైదరాబాదులో తెలంగాణ బిజెపి కీలక సమావేశం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అధ్యక్షతన హైదరాబాద్లో నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగనుంది.
xPress24, Hyderabad, October 24, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అధ్యక్షతన హైదరాబాద్లో నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగనుంది. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా బిజెపి జాతీయ నాయకుడు సునీల్ బన్సాల్ ఇప్పటికే హైదరాబాద్లోనే మకాం వేశారు. అభ్యర్థుల ఎంపికతో పాటు పార్టీ రాజకీయ వ్యూహాలు, ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.