xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలుశ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం..మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లుగుంటూరులో మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టు ప్రారంభంస్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలుదళితుల హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్తా: ఎంపీ వంశీకృష్ణపుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలుశ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం..మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లుగుంటూరులో మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టు ప్రారంభంస్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలుదళితుల హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్తా: ఎంపీ వంశీకృష్ణ
ఆంధ్రప్రదేశ్

నూతన పాలకవర్గాల తొలి సమావేశాలు

23-11-2026 10:25
నూతన పాలకవర్గాల తొలి సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ లోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో నూతన పాలకవర్గాల తొలి సమావేశాలు సోమవారం నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి సహా 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక, నగర పంచాయతీల్లో తొలి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సమావేశాల నిర్వహణ, ప్రమాణ స్వీకారాలు, ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారంతో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో నూతన పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం కానుంది.
xPress24, Amaravati, November 23, ఆంధ్రప్రదేశ్ లోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో నూతన పాలకవర్గాల తొలి సమావేశాలు సోమవారం  నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ,  తిరుపతి సహా 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక, నగర పంచాయతీల్లో  తొలి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సమావేశాల నిర్వహణ, ప్రమాణ స్వీకారాలు, ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.  ప్రమాణ స్వీకారంతో  రాష్ట్రంలోని  పట్టణ స్థానిక సంస్థల్లో నూతన పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం కానుంది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.