ఆంధ్రప్రదేశ్
నంద్యాల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా షేక్ బుర్హానుద్దీన్ ఏకగ్రీవ ఎన్నిక
21-11-2026 09:44

నంద్యాల జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా బనగానపల్లె జడ్పీటీసీ సభ్యుడు షేక్ బుర్హానుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
xPress24, Nandyal, November 20,
నంద్యాల, నవంబర్ 20:
నంద్యాల జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా బనగానపల్లె జడ్పీటీసీ సభ్యుడు షేక్ బుర్హానుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్‌పర్సన్‌గా సిరివెళ్ల జడ్పీటీసీ సభ్యుడు కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నంద్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నూతన పాలకవర్గ సభ్యులతో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా నూతన చైర్‌పర్సన్ షేక్ బుర్హానుద్దీన్ మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీ, జడ్పీటీసీ సభ్యులందరితో సమన్వయం చేసుకుంటూ జిల్లా పరిషత్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఏకపక్ష నిర్ణయాలకు తావులేకుండా అందరి సలహాలు, సూచనల మేరకు ముందుకు సాగుతానన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి జడ్పీటీసీ సభ్యులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బైట్: షేక్ బుర్హానుద్దీన్, నూతన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, నంద్యాల.