ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకోవాలి
22-10-2026 15:59

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు.
xPress24, Paravathipuram, October 22,
పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 22: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు.
గురువారం పార్వతీపురం ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థుల సందేహాలను వెంటనే నివృత్తి చేసేందుకు హెల్ప్‌డెస్క్‌లను నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు. నామినేషన్ పత్రాల సమర్పణలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లు, రిసెప్షన్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సుల భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు చేపట్టిన భద్రతా ఏర్పాట్లపై మండల స్థాయి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.