xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదికప్రభావిత గ్రామాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం : పవన్‌ కళ్యాణ్‌తుపాను ప్రభావంపై రైల్వే మంత్రి సమీక్షఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులుప్రగతి ప్రాజెక్టులపై సీఎస్‌లతో ప్రధానమంత్రి సమీక్షఅవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలితుపాను నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదికప్రభావిత గ్రామాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం : పవన్‌ కళ్యాణ్‌తుపాను ప్రభావంపై రైల్వే మంత్రి సమీక్షఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులుప్రగతి ప్రాజెక్టులపై సీఎస్‌లతో ప్రధానమంత్రి సమీక్షఅవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
జాతీయం

న్యూఢిల్లీలో తలపెట్టిన ర్యాలీకి ప్రత్యేక రైళ్లను కేటాయించేందుకు రైల్వేశాఖ నిరాకరించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం

29-10-2026 09:40
న్యూఢిల్లీలో తలపెట్టిన ర్యాలీకి ప్రత్యేక రైళ్లను కేటాయించేందుకు రైల్వేశాఖ నిరాకరించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం
నవంబర్ 1న దేశ రాజధాని న్యూఢిల్లీలో తలపెట్టిన ర్యాలీకి ప్రత్యేక రైళ్లను కేటాయించేందుకు రైల్వేశాఖ నిరాకరించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం 'రైల్ నిలయం' వద్ద కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆందోళనకు దిగాయి.
xPress24, Hyd, October 28, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు చేపట్టిన ఈ ధర్నా ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ...పాజ్.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పార్టీ నేతలు శ్రీగణేష్, దానం నాగేందర్, నవీన్ యాదవ్ తదితర నేతలు కార్యకర్తలతో కలిసి రైల్ నిలయం గేట్లను నెట్టుకుని లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బారికేడ్లతో వారిని అడ్డుకుని, ధర్నా చేస్తున్న ముఖ్య నేతలందరినీ అదుపులోకి తీసుకుని మొండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ....పాజ్.. రైల్వే అధికారుల తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఢిల్లీ నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు రెండు ప్రత్యేక రైళ్లను కేటాయించాలని  ఆరు రోజుల క్రితమే దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరామన్నారు.  సానుకూలంగా ఉన్నట్లు నటించి నిన్న రాత్రి ఆకస్మికంగా అనుమతి లేదని చెప్పారన్నారు.  ఎన్ని అడ్డంకులు కల్పించినా తామంతా ఢిల్లీ వెళ్తామని,  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసేంతవరకు పోరాడతామన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.