జాతీయం
న్యూఢిల్లీలో 'సరస్ శక్తి ఫుడ్ ఫెస్టివల్-2026'ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
24-11-2026 11:22

న్యూఢిల్లీలో 'సరస్ శక్తి ఫుడ్ ఫెస్టివల్-2026'ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు శాశ్వత మార్కెట్ కల్పించేందుకు దేశవ్యాప్తంగా సరస్ మేళాలను విస్తరిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 'లఖ్‌పతి దీదీ'లతో ముచ్చటించిన మంత్రి, గ్రామీణ మహిళల సంప్రదాయ వంటకాలకు జాతీయ వేదిక కల్పించడమే ఈ ఫెస్టివల్ లక్ష్యమని పేర్కొన్నారు.
xPress24, Delhi, November 23,
న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'సరస్ శక్తి ఫుడ్ ఫెస్టివల్-2026'ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సరస్ మేళాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను వివరించారు. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు శాశ్వత మార్కెట్ వేదికను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
'లఖ్‌పతి దీదీ'లతో కేంద్ర మంత్రి ముఖాముఖి
ఫెస్టివల్ ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు (లఖ్‌పతి దీదీలు)తో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి ఉత్పత్తులు, వ్యాపార అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ మహిళల వ్యాపార నైపుణ్యాలకు, సంప్రదాయ వంటకాల వారసత్వానికి, వైవిధ్యభరితమైన ఆహార సంస్కృతికి జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు చక్కటి వేదికను కల్పించడమే ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖలు పేర్కొన్నాయి.