xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షమున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
తెలంగాణ

నిరుద్యోగ యువతకు పీఎం ఇంటర్న్‌షిప్ వరం.. సూర్యాపేటలో పెరిగిన నమోదు

02-11-2026 12:07
సూర్యాపేట జిల్లా నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం చక్కటి అవకాశమని జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ భారతి తెలిపారు. అగ్రశ్రేణి కంపెనీల్లో 6 నుంచి 9 నెలల ఇంటర్న్‌షిప్‌తో పాటు నెలకు రూ. 9,000 స్టైపెండ్, రూ. 6,000 వన్-టైమ్ చెల్లింపు లభిస్తుందన్నారు. ఆసక్తిగల యువత అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
xPress24, SURYAPET, November 2, సూర్యాపేట జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం గొప్ప అవకాశంగా మారిందని సూర్యాపేట జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ భారతి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో యువత నమోదు శాతం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. జిల్లాలోని ఔత్సాహిక నిరుద్యోగ యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని  పిలుపునిచ్చారు. రూ. 9 వేల ఉపకార వేతనం.. అగ్రశ్రేణి కంపెనీల్లో శిక్షణ ఈ పథకం ద్వారా ఎంపికైన యువతకు దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలు, అగ్రశ్రేణి కంపెనీలలో ప్రత్యక్ష పని అనుభవం (పెయిడ్ ఇంటర్న్‌షిప్) లభిస్తుందని తెలిపారు. శిక్షణ కాలంలో ప్రతి నెలా రూ. 9,000 చొప్పున ఆర్థిక సహాయంతో పాటు, అదనంగా రూ. 6,000 వన్-టైమ్ గ్రాంట్‌ను కేంద్రం అందజేస్తుంది. అభ్యర్థుల ఆసక్తి, అర్హతను బట్టి 6 నుంచి 9 నెలల పాటు ఈ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం ఉంటుందని, ఏడాది పొడవునా వివిధ రంగాల కంపెనీలలో అవకాశాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం, ఇతర సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 116 090 ను సంప్రదించవచ్చని తెలిపారు. పోటీ ప్రపంచంలో పరిశ్రమలకు అవసరమైన ప్రత్యక్ష అనుభవాన్ని పొంది బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అధికారులు ఆకాంక్షించారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.