ఆంధ్రప్రదేశ్
నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
24-10-2026 09:49

అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ తెలిపారు.
xPress24, Anakapalli, October 23,
అనకాపల్లి, అక్టోబర్ 23:
అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ తెలిపారు.
ఈ నెల 28వ తేదీన జరగాల్సిన నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీల ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు వాయిదా వేసినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సవరించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైతే నవంబర్ 2వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తామని, నవంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.