xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తన అధికార బృందంలో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో మంచిర్యాలలో అవగాహన కార్యక్రమంనేడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుఐదు దక్షిణాది రాష్ట్రాలకు వరిధాన్యం నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్రం అనుమతిఅయోధ్యలో ఘనంగా పదవ వార్షిక పవిత్ర ‘దీపోత్సవ్-2026’ వేడుకలుతన అధికార బృందంలో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో మంచిర్యాలలో అవగాహన కార్యక్రమంనేడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుఐదు దక్షిణాది రాష్ట్రాలకు వరిధాన్యం నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్రం అనుమతిఅయోధ్యలో ఘనంగా పదవ వార్షిక పవిత్ర ‘దీపోత్సవ్-2026’ వేడుకలు
తెలంగాణ

నవంబర్ 19న ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

07-11-2026 11:20
తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభంకానుంది. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా వెల్లడించారు.
xPress24, Siddipet, November 7, నవంబర్ 19 న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రూ. 5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు  మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ .. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తనదేనన్నారు. 2007 సంవత్సరంలో ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు మంజూరు అయ్యాయన్నారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు సైతం క్లియర్ అయ్యాయని, కాలువల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశామని, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు ద్వారా కాలువల నుంచి గ్రామాలకు, రైతులకు సాగునీరు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను కవలలుగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. గండిపల్లి ప్రాజెక్టు ద్వారా 14000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. చిగురు మామిడి, సైదాపూర్ మండలాలకు మిడ్ మానేరు ఫేజ్ 3 ద్వారా సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం హుస్నాబాద్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని... ప్రస్తుతం మరో 2వేల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. దీపావళి వేడుకలను ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులతో కలిసి జరుపుకోవాలని పార్టీ నాయకులు, ప్రతినిధులు, అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ హుస్నాబాద్ లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బైట్: పొన్నం ప్రభాకర్, మంత్రి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.