తెలంగాణ
నవంబర్ 29న బీఆర్ఎస్ దీక్షా దివస్ వేడుకలకు కార్యాచరణ రూపకల్పన
02-11-2026 15:13

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో భాగంగా 2009 నవంబర్ 29న కేసీఆర్ కరీంనగర్ జిల్లా అలుగునూర్ వద్ద అరెస్టయిన సందర్భాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ ఉత్సవాలను నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
xPress24, HYDERABAD, November 2,